epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ బడుల్లో సమస్యల తాండ‌వం

ప్రభుత్వ బడుల్లో సమస్యల తాండ‌వం
ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అవస్థలు
గంభీరావుపేట మండలంలో 23 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ
మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆందోళన

కాకతీయ, గంభీరావుపేట : విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరిచిన వేళ, గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మండలంలోని 43 పాఠశాలల్లో (12 జెడ్పీహెచ్ఎస్, 31 ప్రాథమిక) 3,294 మంది విద్యార్థులు ఉండగా, నిబంధనల ప్రకారం ఉండాల్సిన 221 మంది ఉపాధ్యాయులకు గానూ కేవలం 198 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 23 పోస్టులు ఖాళీగా ఉండి బోధన కుంటుపడుతోంది. దోసలగూడెం, ముచ్చర్ల, ముస్తఫానగర్, మల్లారెడ్డిపేట, లింగన్నపేట తండా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడల కొరత తీవ్రంగా వేధిస్తోంది. లింగన్నపేట, గోరంటాల పాఠశాలల్లో కనీస మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి ఎస్సీ కాలనీ పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతూ విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, డిప్యూటేషన్ల వల్ల చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

సత్తా చాటుతున్న విద్యార్థులు.. అయినా పట్టించుకోని సర్కారు
సమస్యలు ఉన్నా, గంభీరావుపేట మండల విద్యార్థులు ఫలితాల్లో మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో 536 మందికి గానూ 519 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా ఏడుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చాటారు. మండలంలోని నర్మాల గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై వెళ్లడంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేకపోయారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేకుండా పిల్లలను పాఠశాలకు పంపడం వృధా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నర్మాల గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యాశాఖలో నెలకొన్న ఈ ఇబ్బందులను పరిష్కరిస్తేనే ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.