epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే

సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే
ఓటు హక్కును ప్ర‌తీ ఒక్క‌రూ కాపాడుకోవాలి
కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు
కరీంనగర్‌లో ఎన్యుమరేషన్ ఫారం నింపి బీఎల్ఓకు అందజేసిన మంత్రి
జూలై 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

కాకతీయ, కరీంనగర్ : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, అలా చేస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఓటరు జాబితాలో పేరును సరిచూసుకోవడం, వివరాలను నమోదు చేయడం అనేది ప్రజాస్వామ్య బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా చైతన్యపురిలోని సాధన స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్, స్వయంగా ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందజేశారు. అనంతరం ఆన్‌లైన్‌లో కూడా తన వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ పురోగతి, ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలై 24వ తేదీలోపు ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 50 శాతం మంది మాత్రమే ఫారాలు సమర్పించినట్లు అధికారులు ఆయనకు వివరించారు.

నిర్లక్ష్యం వద్దు.. ఓటును కాపాడుకోండి
ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. గడువు ముగిసే వరకు వేచి చూడకండి: “జూలై 24 వరకు గడువు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. చివరి రోజు కోసం ఎదురుచూడకుండా ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారం నింపండి.ష‌ బీఎల్ఓలకు సహకరించండి: “బీఎల్ఓ ఇంటికి వస్తే సహకరించి, ఫారం తీసుకుని వివరాలు సరిచూసి గడువులోగా అందజేయాలి. యువతకు పిలుపు: “సోషల్ మీడియాలో రాజకీయాల గురించి గంటల తరబడి పోస్ట్‌లు పెడతారు, కానీ మీ ఓటు జాబితాలో ఉందో లేదో ఎప్పుడైనా చూసుకున్నారా? ఓటు లేకపోతే మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది? ప్రతి యువకుడు తన కుటుంబంలోని ఓట్లు పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అముల్యమైన హక్కు: “ఓటు అంటే కేవలం కాగితం ముక్క కాదు.. అది ప్రజల చేతిలో ఉన్న అధికారం, ప్రశ్నించే హక్కుకు బలమంటూ పిలుపునిచ్చారు.

రాజకీయ ఆరోపణలు
సర్ ప్రక్రియ అనేది రాజకీయ కార్యక్రమం కాదని, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమమని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “కొన్ని చోట్ల సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మజ్లిస్‌తో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోంది. హిందువులంతా అప్రమత్తంగా ఉండి సర్ ప్రక్రియలో పాల్గొనాలి. లేకపోతే తెలంగాణలో హిందువులు మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది” అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. చివరిగా, ప్రతి ఒక్కరూ పది నిమిషాలు కేటాయించి ఎన్యుమరేషన్ ఫారం నింపాలని, లేనిపక్షంలో పోలింగ్ రోజున ‘నా ఓటు ఎక్కడ?’ అని బాధపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.