epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాళేశ్వరం పేరుతో ప్రజలను మోసం చేశారు

కాళేశ్వరం పేరుతో ప్రజలను మోసం చేశారు
పెద్దపల్లికి కాళేశ్వరం నీళ్లు వచ్చాయని నిరూపించాలి
మండల స్థాయిలోనే ప్రజలకు వేగంగా ప్రభుత్వ సేవలు
సూపర్ ఎల్‌నినోతో ప్రత్యామ్నాయ పంటలే మేలు
విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

కాకతీయ, పెద్దపల్లి/ఓదెల : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను 100 అబద్ధాలతో మభ్యపెట్టిందని, పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు వచ్చాయని నిరూపించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సవాల్ విసిరారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ప్రజలకు మండల స్థాయిలోనే వేగంగా ప్రభుత్వ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేసి, జలసిరి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల వినతులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని విజయ రమణారావు ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. కన్నెపల్లి నుంచి తొమ్మర్లగూడెం వరకు నీరు వచ్చే వ్యవస్థే లేదని, పెద్దపల్లి జిల్లాలో గానీ, నియోజకవర్గంలోని ఒక్క గ్రామానికైనా కాళేశ్వరం నీళ్లు అందించామని బీఆర్ఎస్ నాయకులు నిరూపించాలని సవాల్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది మేడారం నిర్మించినా ఏ నియోజకవర్గానికీ పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదని విమర్శించారు. తొలి నీళ్లే పెద్దపల్లిని ముద్దాడతాయని గతంలో చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల బుర్రల్లో అబద్ధాలను నింపి రాజకీయ ప్రయోజనం పొందడమే గత పాలకుల లక్ష్యమని మండిపడ్డారు.

రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఒక ఎకరం వరికి అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల్లో కందులు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేయవచ్చన్నారు. ప్రస్తుతం కందులు, నువ్వులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేస్తే నష్టాలను నివారించుకోవచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి సమస్య తీరిపోయిందని రైతులు భావించవద్దని హెచ్చరించారు.

అభివృద్ధి పనులు వేగంగా

పెద్దపల్లి జిల్లాలో గత రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. శ్రీరాంపూర్‌లో తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఓదెలలో కూడా ఆధునిక కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే కోర్టు భవన నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. పోత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు పూర్తయిందని, జిల్లాలో రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. గతంలో చెరువులను నింపేలా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం కొంత మేర నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విజయ రమణారావు అన్నారు. ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామని, ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు.

విద్య, వైద్యంలో రాష్ట్రానికి ఆదర్శంగా జిల్లా

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను విజయ రమణారావు అభినందించారు. గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5.5 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. ఒకప్పుడు మౌలిక వసతులు లేని పాఠశాలలు ప్రస్తుతం అన్ని సదుపాయాలతో అభివృద్ధి చెందాయని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గతంలో నెలకు 30 నుంచి 40 ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం నెలకు సుమారు 250 ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. రూ.53 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.