పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు…
ఉద్యోగం,పెళ్లి పేరుతో మోసం… వీడియోలు తీసి బ్లాక్ మెయిల్…
రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు కొట్టేశారని యువతి ఫిర్యాదు…
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో BNS సెక్షన్ల కింద కేసు నమోదు…
కాకతీయ,తెలంగాణ బ్యూరో: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.ఉద్యోగం ఇప్పిస్తానని,పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగికం గా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నెల 26న హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని రాజకీయ మేధావులు మండిపడుతున్నారు.
ఫిర్యాదులో బాధితురాలు కీలక ఆరోపణలు చేసిందని సమాచారం.ఉద్యోగ ఇంటర్వ్యూ పేరుతో పిలిపించి మోసం చేశారని,పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించారని తెలిపింది.తనకు తెలియకుండా వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారని,రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు BNS 69,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో పినపాక రాజకీయాల్లో కలకలం రేగింది.

