ధాన్యం బకాయిల కోసం బీజేపీ ఆందోళన
పలువురు నేతలు, కార్యకర్తల అరెస్ట్
అస్వస్థతకు గురైన జిల్లా ప్రధాన కార్యదర్శి
కాకతీయ, వేములవాడ : రైతుల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శనివారం వేములవాడలో ఆందోళన చేపట్టింది. చెక్కపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అస్వస్థతకు గురై కుప్పకూలారు. పార్టీ నాయకులు ఆయనను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తెలంగాణ చౌక్‌లో బైఠాయించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై అక్రమ అరెస్టులు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వేములవాడకు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన నేతలను పరామర్శించడంతో పాటు రైతుల ధాన్యం బకాయిల అంశంపై తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పట్టణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

