రుద్రంగిలో నేడు ఏటీసీ నిర్మాణానికి శ్రీకారం
రూ.46 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్
మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు
కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రూ.46 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నట్లు ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి తెలిపారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరుకానున్నారు. ఈ కేంద్రంలో 260 మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నరసయ్య, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గట్ల మీనయ్య, తర్రె మనోహర్, కోమిరె శంకర్ తదితరులు పాల్గొన్నారు.

