డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు
రుద్రంగిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు
కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం ఎస్సై మోతిరాం ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై వాహనదారులకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించాలని ఎస్సై సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్, అధిక వేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. తనిఖీల్లో ఏఎస్సై జగదీష్, కానిస్టేబుళ్లు మధు, శంకర్, విక్రమ్, హెడ్ కానిస్టేబుళ్లు రాము, అంజి పాల్గొన్నారు.

