epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రైవేట్ స్కూళ్లకు అండెవరిది..?

ప్రైవేట్ స్కూళ్లకు అండెవరిది..?
ఏన్కూర్‌లో ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం
యూనిఫామ్‌లు, పుస్తకాల కొనుగోళ్లలో కమిషన్ ఆరోపణలు
విద్యాశాఖ మౌనంపై అనుమానాలు
కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణ కోరుతున్న బాధితులు

కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఓ ప్రైవేట్ పాఠశాల భారీ ఫీజులతో పాటు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల కొనుగోలులోనూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం సూచించిన దుకాణాల్లోనే యూనిఫామ్‌లు, పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం వస్త్ర, పుస్తక దుకాణాలతో కమిషన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు అమలవుతున్నాయా..?

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, బలవంతపు కొనుగోళ్లను అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ తనిఖీలు నిర్వహించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలకు అధికారుల అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని మండలంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణం, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల విక్రయ విధానాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.