ఏన్కూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా గోవిందు శ్రీనివాసరావు
కాకతీయ, ఏన్కూర్/తల్లాడ : టీపీసీసీ ఆదేశాల మేరకు ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ను మర్యాదపూర్వకంగా కలవగా, ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీలను పారదర్శకంగా ఏర్పాటు చేసి, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గోవిందు శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, కమిటీల ఏర్పాటులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. తనను మండల ఇన్‌చార్జిగా నియమించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

