epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దాలి

ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
అత్యుత్తమ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు
ప్రతిపాదనలను త్వరితగతిన అమలు దశకు తీసుకురావాలి
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లాలోని సహజసిద్ధమైన నీటి వనరులు, చెరువులు, సరస్సులను పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటి వనరులు, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం బోనకల్, మధిర మండలాల్లో పర్యటించిన కలెక్టర్ కలకోట పెద్దచెరువు, మడుపల్లి, మధిర ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతలో లోపాలు తలెత్తితే సహించేది లేదన్నారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో ఉపాధి

మధిర రివర్‌ఫ్రంట్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మధిర ట్యాంక్‌బండ్ వద్ద కాటేజీలు, రిసెప్షన్, కిచెన్, రెస్టారెంట్, విద్యుదీకరణ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కలకోట పెద్దచెరువు వద్ద కాటేజీలు, కేఫెటీరియా, పార్కింగ్ తదితర సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానికులకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతిపాదనలను త్వరగా ఖరారు చేసి అమలు దశకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. రహదారులు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక అభివృద్ధికి భూమి అవసరమైన చోట భూసేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి బి. సుమన్ చక్రవర్తి, తహసీల్దార్లు రాంబాబు, బోనకల్ తహసీల్దారు, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.