epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు
క్రేన్లు, గజ ఈతగాళ్లు, బోట్లు సిద్ధంగా ఉంచాలి
నిమజ్జన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్‌ దివాకర టీఎస్‌
కాకతీయ, ఖమ్మం బ్యూరో : గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం దంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. చెరువులో నీటిమట్టం దృష్ట్యా బారికేడింగ్‌, గజ ఈతగాళ్లు, క్రేన్లు, బోట్లు, రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రి నిమజ్జనాలకు లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎత్తైన విగ్రహాల తరలింపునకు ప్రత్యేక రూట్‌, ట్రాఫిక్‌, పోలీసు బందోబస్తు, రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్‌ షాక్‌ ప్రమాదాలు, షార్ట్‌సర్క్యూట్‌ జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నిమజ్జన పాయింట్‌ వద్ద మెడికల్‌ క్యాంపులు, 108 వాహనం, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించాలని, క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండాలని, అడ్డుగా వచ్చే చెట్టు కొమ్మలను ముందుగానే తొలగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌, వైద్య, అగ్నిమాపక, నీటిపారుదల శాఖలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేసి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్‌, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ జయచందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు పువ్వాడ...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.