epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దానంకు సుప్రీంలో షాక్‌

దానంకు సుప్రీంలో షాక్‌
ఎమ్మెల్యేపై అనర్హత వేటు ఖరారు
హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
మరో పార్టీ తరఫున పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు
‘ఘర్‌ వాపసీ’ చట్టసభలకు వర్తించదని స్పష్టీకరణ
‘ఆయారాం.. గయారాం’ పెరుగుతున్నారంటూ వ్యాఖ్య
ఉపఎన్నికపై సీఎం నిర్ణయమే ఫైన‌ల్ : దానం నాగేందర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని సుప్రీంకోర్టు విచారణలో పరిగణనలోకి తీసుకుంది. ‘ఘర్‌ వాపసీ’ చట్టసభలకు వర్తించదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ‘ఆయారాం.. గయారాం’లు పెరుగుతున్నారని వ్యాఖ్యలు చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ ఆ పిటిషన్లను కొట్టివేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

బీఆర్‌ఎస్‌ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడిగా కొనసాగుతూ కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజ్యాంగపరమైన నిషేధం లేదని దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో వాదించారు. గతంలో మరో పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి సంబంధించిన తీర్పును ఆధారంగా చేసుకుని తనపై అనర్హత వేటు వేయడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేదు.

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ

దానం నాగేందర్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తన ఉత్తర్వుల ప్రతులను అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఖైరతాబాద్‌ స్థానంపై తదుపరి ఎన్నికల ప్రక్రియకు మార్గం ఏర్పడింది. ‘తీర్పును స్వాగతిస్తున్నా’సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తనకు ప్రజాక్షేత్రంలో బలం ఉందని చెప్పారు. గతంలో 3 సార్లు గెలిచానని, ఒక ఉపఎన్నికలో 1,600 ఓట్లతో ఓడిపోయానని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, కలిసి పనిచేస్తే తప్పకుండా గెలుస్తామని అన్నారు. ఉపఎన్నికల్లో పోటీపై సీఎం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు.

ఫిరాయింపులపై మళ్లీ వేడెక్కిన రాజకీయం

దానం నాగేందర్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. చట్టసభ సభ్యత్వం, పార్టీ మార్పులు, పదో షెడ్యూల్‌ నిబంధనలపై తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దళితులు, గిరిజనులకు భరోసా

దళితులు, గిరిజనులకు భరోసా ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర...

నయీం ఆస్తుల లెక్క తారుమారు..!

నయీం ఆస్తుల లెక్క తారుమారు..! 327 ఆస్తులపై జీవో.. గెజిట్‌ జారీ తూప్రాన్‌పేటలోనే ఎందుకీ...

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా!

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా! ప‌ట్ట‌ణ శివారులోనే భారీ స్టాకు పాయింట్‌ పీడీఎస్‌...

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..!

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..! పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి...

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే!

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే! 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రభుత్వ భూములు...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.