ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’
నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల సాయం
నర్సయ్య కుటుంబానికి పరామర్శ
‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’ సభ్యుల మానవత్వం
కాకతీయ, వేములవాడ: కొలనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన భార్య నర్సవ్వ కుటుంబం విషాదంలో మునిగింది. ఈ నేపథ్యంలో ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’ సభ్యులు కుటుంబానికి అండగా నిలిచారు. ఫౌండేషన్ తరఫున 50 కేజీల బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర సరుకులను గ్రామ సర్పంచ్ గుండా వెంకటేష్‌గౌడ్, మానాల ఉపసర్పంచ్ దాసరి అశోక్, గ్యారె శేఖర్, వడ్డేపల్లి రాజేందర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలవడం ద్వారా ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకుంది. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్ము దేవరాజు, కొమ్ము రాజు, చెప్పాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

