epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు

కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణ సమగ్రాభివృద్ధి బీఆర్‌ఎస్ పాలనతోనే సాధ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ 37వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిసిన రేగా కాంతారావు, “పాల్వంచ–కొత్తగూడెం ప్రాంత అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే వేగంగా జరిగింది. భవిష్యత్తులోనూ పట్టణానికి ప్రగతి దిశ చూపగల శక్తి బీఆర్‌ఎస్‌కే ఉంది” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతుబంధు, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, తులం బంగారం, వృద్ధులకు రూ.4000 పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. “రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్వంచ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ద్వారానే పట్టణ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గెలిపిస్తే వార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతా – స్వప్న కుమారి

ఈ సందర్భంగా 37వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి మాట్లాడుతూ, తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే, వార్డును అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. “అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడమే నా ప్రధాన లక్ష్యం. ఒక్క అవకాశం ఇవ్వండి – వార్డును ఆదర్శంగా నిలబెడతా” అని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, యువజన విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.