epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..?

ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..?
అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు
ఎన్నికల్లో కాంగ్రెస్ నేత‌ల దౌర్జన్యం
అయినా పోలీసుల క‌ళ్ల‌కు ఈ దృశ్యాలు క‌నిపించ‌డం లేదు
బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులు అక్రమం
అక్రమ కేసులకు పోలీసులే బాధ్యత వహించాలి
ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉంది
డీజీపీ తీరును త‌ప్పుబ‌డుతూ హరీష్‌రావు తీవ్ర విమర్శలు
రైతుబంధు వెంటనే జమ చేయాలని డిమాండ్
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం

కాకతీయ, సంగారెడ్డి : డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొంటున్న “ఖాకీ బుక్” కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా అని మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా వార్డుల్లో తిరిగారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు బహిరంగంగా జరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చేసిన తప్పులు పోలీసుల కళ్లకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని హరీష్ రావు ఆరోపించారు. ఘర్షణల సమయంలో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు దాడులకు పాల్పడ్డారని, ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే తీవ్రమైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. డీజీపీ తరచూ చెప్పే “ఖాకీ బుక్” అందరికీ సమానమైతే కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అవమానించిన ఘటనల్లో కూడా చర్యలు తీసుకోలేదని, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో చట్టం ముందు జవాబుదారీ కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ వర్గానికి చెందిన కార్యకర్తలపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని సూచిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని అన్నారు.

ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉంది

అన్ని అవరోధాలు, అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం జరిగినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 800 కౌన్సిలర్ స్థానాలు, 20 చైర్మన్ పదవులు గెలుచుకోవడం ప్రజా విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల మద్దతుతోనే పార్టీ బలంగా నిలిచిందని తెలిపారు. అధికార పార్టీ పోలీసు వ్యవస్థను ఉపయోగించి కొన్ని స్థానాల్లో విజయం సాధించిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజల తీర్పు స్పష్టంగా బీఆర్ఎస్ వైపే ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో నిధుల విడుదలలో ఆలస్యం చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల అక్రమ చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని హరీష్ రావు తెలిపారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, పట్టోళ్ల శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.