epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా
కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3 కోట్లు వసూళ్లు
నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులు బట్టబయలు
వెలుగుమట్ల భూ వివాదంపై ఇప్పటికే 19 కేసులు
ఇప్పటివరకు 9 మంది అరెస్ట్… కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి నిరుపేదలను మోసం చేసిన ముఠా వ్యవహారం ఖమ్మంలో వెలుగుచూసింది. యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరుపేదల నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించిన సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు జరిగినట్లు తేలిందని ఆయన చెప్పారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి తమను ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని ప్రచారం చేసి అమాయక ప్రజలను నమ్మబలికినట్లు పేర్కొన్నారు.

ఒక్కొక్కరి నుంచి భారీ వసూళ్లు

భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజలను ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ విధంగా అనేక మంది నిరుపేదలు మోసపోయారని చెప్పారు. వసూలు చేసిన డబ్బును నిందితులు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే తమ వద్ద భూదాన్ పట్టాలు ఉన్నాయని, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పి బాధితులను నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ముఠాపై గతంలో కూడా సుమారు 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

బాధితులకు ప్రభుత్వం అండ

వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. మోసపోయిన ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి బాధితులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్‌తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా మోసపోయినట్లు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం, బల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి కృష్ణ, ముదిగ రాములు, మంకిడి లింగరాజు, రాచకొండ నరసింహాచారి, దండా లింగయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.