epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చదువుకున్న కాలేజీకే ‘చీఫ్ గెస్ట్’గా

చదువుకున్న కాలేజీకే ‘చీఫ్ గెస్ట్’గా
అప్పాయిగూడెం సర్పంచ్ భావోద్వేగం
విద్యార్థులతో పాత జ్ఞాపకాలను పంచుకున్న సర్పంచ్ దండు ప్రవీణ్
ఘనంగా ప్రారంభమైన స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్
139 మంది మైనారిటీ విద్యార్థినుల భాగస్వామ్యం

కాకతీయ, కారేపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన’లో భాగంగా అప్పాయిగూడెం పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో మంగళవారం “స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్” అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. క్రీడా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్ దండు ప్రవీణ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను విద్యార్థిగా చదువుకున్న ఇదే ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణానికి, నేడు సర్పంచ్ హోదాలో ముఖ్యఅతిథిగా రావడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని కొనియాడారు. విద్యార్థి దశలో తాను గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, క్రమశిక్షణతో చదివితే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.

క్రీడలతోనే మానసిక ఉల్లాసం..

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వేసవి శిబిరాలను ఏర్పాటు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మైనారిటీ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని తెలిపారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థినులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటల సమయంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని, పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సమ్మర్ క్యాంప్‌లో మొత్తం 139 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ. ముజాహిద్, ప్రాంతీయ సమన్వయకర్త అరుణ కుమారి, విజిలెన్స్ అధికారి సీతారాములు, ప్రిన్సిపాల్ డి. సావిత్రి, కాంగ్రెస్ నాయకులు పాల్తీయ శివాజీ, పీఈటీలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.