కవిత కొత్త పార్టీ సభకు తరలిన కరీంపేట
కాకతీయ, శంకరపట్నం: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లారు. గ్రామానికి చెందిన సల్మా నేతృత్వంలో మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో బస్సుల్లో సభకు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సభకు వెళ్లిన వారు కల్వకుంట్ల కవిత ప్రకటించిన పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికరంగా చర్చించుకున్నారు. కొత్త పార్టీపై తామంతా ఆశాభావంతో ఉన్నామని, కవిత నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కరీంపేట ప్రజల సహకారం ఎంతో ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వారు కోరారు.

