epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంక్షేమంలో పెద్దపల్లి ఆదర్శం

సంక్షేమంలో పెద్దపల్లి ఆదర్శం
ప్ర‌భుత్వ విప్ విజయ రమణారావు
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు
మే 6న మెగా జాబ్ మేళా.. 2 వేల మందికి ఉపాధి
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు

కాకతీయ, పెద్దపల్లి : సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం బండంపల్లిలో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు జిల్లాలో సమగ్రంగా అమలవుతున్నాయని, సామాన్యులకు పాలన చేరువవుతోందని వివరించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచి నాలుగు అవార్డులు సాధించడం గర్వకారణమని విప్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో గతంలో 280గా ఉన్న ఓపీ సంఖ్య 900కు, ప్రసవాల సంఖ్య 40 నుంచి 250కు పెరిగిందని తెలిపారు. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా సాగుతోందని, త్వరలోనే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్డియాలజీ, డయాలసిస్ సేవలు మెరుగుపడటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారని గుర్తుచేశారు.

యువతకు ఉపాధి.. రైతులకు భరోసా..
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. మే 6న వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 100 కంపెనీలు పాల్గొని 2 వేల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు అసత్యమని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

అమల్లో అభయహస్తం..
గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.