ఎల్లమ్మ సన్నిధిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఇందుర్తి అమ్మవారికి శివకుమార్ దంపతుల ప్రత్యేక పూజలు
ఘనంగా సన్మానించిన గ్రామస్థులు, ఆలయ కమిటీ
కాకతీయ, చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, ప్రణీత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో న్యాయమూర్తి దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు న్యాయమూర్తి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని, గ్రామ ప్రజలందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్యక్రమంలో సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ అనిల్, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు సీనియర్ జర్నలిస్టు గాదె రఘునాథ్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కంది శ్రీనివాస్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు గట్టు రమేష్, బుర్ర స్వామి, ఆకుల శ్రీను, గట్టు మొగిలి, బుర్ర పరశురాములు, బత్తిని శ్రీనివాస్, కార్యదర్శి సుమంత్, వార్డు సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

