epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
పంటను కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం
జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా అన్నదాతలకు జరుగుతున్న మేలు శూన్యం
బస్తాల నుంచి లారీల వరకు రైతులు కిరాయిలు చెల్లించే దుస్థితి
పోరాటంతోనే కేంద్రాలు వచ్చాయి.. కదిలితేనే బస్తాలు కదులుతాయి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

కాకతీయ, బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు ఘాటుగా విమర్శించారు. ఆదివారం బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం, రావినూతల సొసైటీ పరిధిలో కల్లాలలో నిల్వ ఉన్న మొక్కజొన్నలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరిస్తూ.. కొనుగోలు కేంద్రాలు ఉన్నా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, బస్తాలు, లారీలు తామే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రైతుల సమస్యలను సావధానంగా విన్న సుదర్శన్ రావు, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఉపన్యాసాలు తప్ప చేతలు లేవు
కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి గింజను కొంటామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుదర్శన్ రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా చోట్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. లారీ డ్రైవర్లు బస్తాకు 40 రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి కళ్ళు లేవా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప, రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోరాటాలకు సిద్ధం కావాలి
వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు వణికిపోతుంటే ప్రభుత్వం చలించకపోవడం బాధాకరమని సుదర్శన్ రావు పేర్కొన్నారు. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులకు జరిగిన ఉపయోగం శూన్యమన్నారు. యూరియా కొరత, కొనుగోలు కేంద్రాల కొరతతో రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయని, మళ్లీ పోరాడితేనే బస్తాలు కదులుతాయని.. అన్నదాతలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొంతు రాంబాబు, దొండపాటి నాగేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు, కిలారు సురేష్, మంద కరుణ, కొమ్ము కమలమ్మ, మాదినేని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.