epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాతర్లపాడులో ‘అగ్ని’ బీభత్సం.. రూ. 28 లక్షల నష్టం!

పాతర్లపాడులో ‘అగ్ని’ బీభత్సం.. రూ. 28 లక్షల నష్టం!
మొక్కజొన్న కల్లాలు, గొర్రెల మందపైకి దూసుకెళ్లిన మంటలు
800 క్వింటాళ్ల ధాన్యం, 30 గొర్రెలు అగ్నికి ఆహుతి
కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు, గొర్రెల కాపరి

కాక‌తీయ‌, చింతకాని : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 800 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం కాలి బూడిదవ్వగా, పొగకు ఊపిరాడక 30 గొర్రెలు మృతి చెందాయి. బాధితులకు మొత్తం కలిపి సుమారు రూ. 28 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. చింతకాని – పాతర్లపాడు రహదారి పక్కన ఉన్న పొలాల్లోని మొక్కజొన్న దంటకు తొలుత మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగడంతో మంటలు అదుపుతప్పి సమీపంలోని మొక్కజొన్న కల్లాలు, కొనుగోలు కేంద్రం వైపునకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో రైతులు ఏమీ చేయలేకపోయారు.

అగ్నికి ఆహుతైన ఆశలు..

ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రైతులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, పుల్లయ్య, అల్లిక శంకర్, గుర్రం రామారావు, టేకుమట్ల పుల్లయ్య, టేకుమట్ల వెంకటేశ్వర్లు, వట్టికూటి రమేష్‌లకు చెందిన సుమారు 800 క్వింటాళ్ల ధాన్యం (బస్తాలు, నూర్పిడి చేయని కంకుల రాశులు) కాలిపోయింది. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిదవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.

ముట్టడించిన పొగ.. మూగజీవాల బలి

ఇదే ఘటనలో గొర్రెల కాపరి ఓబీనబోయిన వీరబాబుకు భారీ నష్టం వాటిల్లింది. ఉదయం మేత కోసం మొక్కజొన్న పొలాల్లో వదిలిన గొర్రెలు.. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతకగా, పొగకు ఊపిరాడక పొలంలోనే చనిపోయి కనిపించాయి. సుమారు 30 గొర్రెలు మృతి చెందడంతో తనకు రూ. 8 లక్షల నష్టం కలిగిందని, తన జీవనాధారం దెబ్బతిందని వీరబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు విన్నవిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.