epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేత‌ల‌ దాడి

కరీంనగర్‌లో రణరంగం
ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేత‌ల‌ దాడి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడ‌నే స‌మాచారం దూసుకొచ్చిన నేత‌లు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు
కార్యాలయంపై రాళ్ల వర్షం.. కారు అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం
నగరం అంతటా భారీగా మోహరించిన బలగాలు
ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ తరహా నిఘా
“కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలంటూ గ‌తంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స‌వాల్‌
“బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు” అంటూ ఇటీవ‌ల‌ కౌశిక్ రెడ్డి కౌంటర్
డ్రగ్స్ సవాళ్లతో భగ్గుమన్న రాజకీయం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం గురువారం రణరంగాన్ని తలపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడికి యత్నించారు. గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలాకర్ క్యాంపు ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న బీజేపీ నేతలు.. ఆయనపై దాడికి యత్నించారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు క్యాంపు ఆఫీసులోని సామగ్రిని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు హుటాహుటినా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య ‘డ్రగ్స్ టెస్ట్’ సవాల్.. చివరకు భౌతిక దాడులకు దారితీసింది.

డ్రగ్స్ టెస్ట్ సవాల్.. తంబాకు కౌంటర్‌తో సెగలు!

ఈ వివాదానికి ప్రధాన కారణం గత రెండు రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, దమ్ముంటే టెస్టుకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తీసుకుంటున్నాడు.. ముందు ఆయన టెస్టుకు రావాలి” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ శ్రేణులు, కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే పక్కా సమాచారంతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

గన్‌మెన్ల అప్రమత్తత!

కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ కౌశిక్ రెడ్డి’ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా గేట్లు తోసుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఆవరణలో ఉన్న ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి వాహనం అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. కార్యాలయంలోని అద్దాలను, కుర్చీలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కౌశిక్ రెడ్డి వ్యక్తిగత గన్‌మెన్లు అప్రమత్తమై ఆందోళనకారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెల్లాచెదురు చేసి, ఎమ్మెల్యేను సురక్షితంగా వెనక్కి పంపించివేశారు.

దమ్ముంటే చర్చకు రండి.. దాడులు పిరికిపంద చర్య!

ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. కేంద్ర మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చలకు భయపడే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఓటమి భయంతో, ప్రశ్నించే గొంతును నొక్కేందుకే బీజేపీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.