మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం..
24 గంటల పాటు అందుబాటులో ఉంటాం
కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య
కాకతీయ, కరీంనగర్ : రైతులకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కడం తన అదృష్టమని, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తామని నూతన చైర్మన్ ఆకుల నరసయ్య స్పష్టం చేశారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, వారికి మద్దతు ధర కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పాలకవర్గం 24 గంటల పాటు అందుబాటులో ఉండి రైతులకు అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో సుల్తానాబాద్ సింగిల్ విండోలో డైరెక్టర్, వైస్ చైర్మన్, చైర్మన్‌గా పనిచేసిన అనుభవాన్ని మార్కెట్ కమిటీ అభివృద్ధికి వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వేము నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ సహా ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు సంబంధిత మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్పొరేటర్లు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు.

