epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
మైనర్ బాలిక ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్‌లో కేసు న‌మోదు
మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు
మూడు ప్రాంతాల్లో లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు
కేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆరోపణలంటున్న బాలిక కుటుంబం
హనీ ట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటున్న భగీరథ్ 
పరస్పర ఆరోపణలతో రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనం
కాకతీయ, హైదరాబాద్/కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపుల ఆరోపణలతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భగీరథ్‌పై తాజాగా పోక్సో కేసు నమోదవడం సంచలనంగా మారింది. తమ 17 ఏళ్ల మైనర్ కుమార్తెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత  సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు పలు కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
“మా కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది”
బాలిక తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. బండి సాయి భగీరథ్ ప్రవర్తన కారణంగా తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే తమ కూతురు తీవ్ర ఆవేదనకు గురైందని చెబుతున్నారు. అంతేకాకుండా… ఇప్పుడు కేసు నుంచి బయటపడేందుకే తమ కుమార్తెపైనే తప్పుడు కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారని బాలిక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. “బాధితురాలినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది” అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ‘హనీ ట్రాప్’ వాదన
ఇక భగీరథ్ వర్గం మాత్రం పూర్తి భిన్నమైన వాదనను ముందుకు తీసుకొస్తోంది. స్నేహం పేరుతో దగ్గరై… తర్వాత పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తోంది. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, ఇప్పటికే ఒత్తిడితో రూ.50 వేల రూపాయలు కూడా ఇచ్చామని చెబుతోంది. అయితే ఈ వాదనలపైనా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “ఏ తప్పూ చేయనప్పుడు రూ.50 వేలు ఎందుకు ఇచ్చారు..?” అన్న ప్రశ్న సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ వర్గం చెబుతున్న ‘హనీ ట్రాప్’ కథనంలో పలు సందేహాలు ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు కేసులు… రెండు వాదనలు
ఒకవైపు భగీరథ్ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్‌లో బ్లాక్‌మెయిలింగ్ కేసు… మరోవైపు హైదరాబాద్ పరిధిలో పోక్సో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. రెండు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండటంతో అసలు నిజం ఏంటన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. పోలీసులు ఇప్పుడు కాల్ డేటా, చాట్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, సీసీ ఫుటేజీలు తదితర అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి స్టేట్‌మెంట్, వైద్య పరీక్షల నివేదికలు కూడా కేసులో కీలకంగా మారనున్నాయి. కేంద్ర మంత్రికి సంబంధించిన కుటుంబం పేరు ఈ కేసులో రావడంతో రాజకీయంగానూ ఇది సెన్సిటివ్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలా..? లేక పోక్సో కేసులో ఉన్న ఆరోపణలే నిజమా..? అన్నది ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.