epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ పాఠశాలల విజయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ పాఠశాలల విజయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
టెన్త్ టాపర్ల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి
ప‌దిలో ప్ర‌తిభ చాటిన విద్యార్థుల‌కు 10వేల చొప్పున నగదు ప్రోత్సాహం
ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
కాకతీయ, పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు ప్రజలకు విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతి ప్రభుత్వ హైస్కూల్ పరిధిలో టాపర్ విద్యార్థుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల ఘనత
ఈ సందర్భంగా విప్ విజయరమణారావు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 98 మందికి పైగా ఉండటం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్లను అభినందించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మరమ్మతులు, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు వంటి పనులను ప్రత్యేక నిధులతో పూర్తి చేశామన్నారు. ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న తెనుగువాడ పాఠశాలను పూర్తిగా పునరుద్ధరించి, నేడు ప్రైవేటుకు దీటుగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. పట్టణ, గ్రామీణ పరిధిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ వారం రోజుల్లో భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
టాప్‌ 11 మంది విద్యార్థులకు నగదు చెక్కుల పంపిణీ
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన శాతాన్ని నమోదు చేశారన్నారు. టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌లో తమ ఆసక్తులకు అనుగుణమైన కోర్సులు ఎంచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఇంటర్ దశలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘనంగా సన్మానించి, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి  శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, విద్యాశాఖ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.