పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం
కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల
కాకతీయ, రామకృష్ణాపూర్ : బూత్ స్థాయి నుంచి పట్టణ కమిటీ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో విస్తరించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. పట్టణ ఉపాధ్యక్షులుగా ఆకుల రాజయ్య, పనస రాజయ్య, కాసర్ల ప్రకాష్, కట్కూరి శ్రీనివాస్ రావు రెడ్డి, మందా సృజన, బత్తుల శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా మేకల శ్రీనివాస్, బత్తుల వేణు, గోపు రాజాం, మేకల సురేందర్, ఆర్రం విద్యాసాగర్ రెడ్డి, ఎర్రబెల్లి రాజేష్, ఎల్పుల సత్యనారాయణను ఎంపిక చేశారు. వీరితో పాటు 11 మంది కార్యదర్శులు, నలుగురు కార్యనిర్వాహక సభ్యులు, మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో ముగ్గురిని నియమించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమలుల్లోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, నీలం శ్రీనివాస్ గౌడ్, గాండ్ల సమ్మయ్య, పుష్ప, దీప పాల్గొన్నారు.

