epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జమ్మికుంటలో నకిలీ పోలీసుల హల్‌చల్

జమ్మికుంటలో నకిలీ పోలీసుల హల్‌చల్
వ్యాపారులపై దాడి, దోపిడీ
ట్రాలీని అడ్డగించి నిర్జన ప్రదేశానికి తరలింపు
బంగారం, నగదుతో పాటు ఫోన్‌పే ద్వారా వసూళ్లు
ఎడ్ల వ్యాపారులను బెదిరించి చితకబాదిన ముఠా
స్థానికుల రాకతో పరార్.. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

కాక‌తీయ‌, హుజురాబాద్ : తాము పోలీసులమంటూ నమ్మించి పశువుల వ్యాపారులను దారుణంగా బెదిరించి, వారి వద్ద నుండి భారీగా బంగారం, నగదు దోచుకున్న ఘోర ఉదంతం జమ్మికుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ దోపిడీ ఘటన గురువారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము వేరే ప్రాంతంలో ఎడ్లను కొనుగోలు చేసి చిన్న ట్రాలీ వాహనంలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోకి రాగానే సుమారు 10 నుండి 13 మంది యువకులతో కూడిన ఒక పెద్ద ముఠా వారి వాహనాన్ని అడ్డగించింది.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి

తమను తాము స్థానిక పోలీసులుగా పరిచయం చేసుకున్న సదరు దుండగులు.. వాహనంలో తనిఖీలు చేయాలంటూ వ్యాపారులను భయపెట్టారు. అనంతరం ఆ ట్రాలీని బలవంతంగా పట్టణ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. చీకట్లోకి తీసుకెళ్లిన తర్వాత అసలు రంగు బయటపెట్టిన నకిలీ పోలీసులు.. బాధితులను తీవ్రంగా బెదిరిస్తూ విచక్షణారహితంగా చితకబాదారు. ప్రాణభయంతో వణికిపోయిన వ్యాపారుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, జేబుల్లో ఉన్న నగదును లాక్కున్నారు. అంతేకాకుండా దుండగులు అంతటితో ఆగకుండా, బాధితుల మొబైల్ ఫోన్లను లాక్కొని బలవంతంగా వారి డిజిటల్ వాలెట్ల నుండి ‘ఫోన్‌పే’ ద్వారా కూడా తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఒకవేళ పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

కొందరు అనుమానితులు అదుపులోకి..

ఈ క్రమంలోనే సమీపంలో వేరే స్థానికుల బైకుల శబ్దం వినబడటంతో, ఎవరైనా వస్తున్నారేమోనన్న భయంతో నిందితులు అక్కడి నుండి చీకట్లోకి పరారయ్యారు. దుండగులు వెళ్లిన వెంటనే బాధితులు లబోదిబోమంటూ జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు జమ్మికుంట పట్టణంలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు ముఖ్య నేతల అనుచరులేనన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని కేసు నుండి తప్పించేందుకు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ ఘటనకు సంబంధించిన కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే రహస్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో పోలీసుల పేరుతో జరుగుతున్న ఈ తరహా దోపిడీలతో స్థానిక వ్యాపార వర్గాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.