epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి

సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి
ప్రజాప్రతినిధులు, అధికారులు స‌హ‌క‌రించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ముందంజ
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ సదస్సులో కలెక్టర్ దివాకర టీఎస్

కాకతీయ, ఖమ్మం, బ్యూరో : ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శుక్రవారం నగరంలోని స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వ పథకమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంలో లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ, ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంకు రుణాలు కల్పించడంతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళా ద్వారా జిల్లా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.

వేసవి కార్యాచరణ.. పారిశుధ్యానికి ప్రాధాన్యత

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రద్దీ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉంటేనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. అలాగే, ప్రభుత్వం త్వరలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థుల వరకు విస్తరించనుందని, పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించనుందని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు బ్యాటరీ వాహనాల పంపిణీ కూడా త్వరలోనే మొదలవుతుందన్నారు. అంతకుముందు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిని, లబ్ధిదారుల వివరాలను సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.