epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

 ‘పెద్ది’కి పర్సంటేజీ సెగ!

‘పెద్ది’కి పర్సంటేజీ సెగ!
సంతకం చేసి ఇస్తేనే థియేటర్లలోకి రానిస్తాం
నిర్మాతలు కావాలనే జాప్యం చేస్తున్నారు
హరిహర వీరమల్లు సమయం నుంచే మా డిమాండ్ ఇది
250 మంది ఎగ్జిబిటర్లది ఒకటే మాట.. ఒకటే బాట
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన తీర్మానం

కాక‌తీయ‌,హైద‌రాబాద్ : టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ చిత్ర ప్రదర్శనకు పర్సంటేజీ సెగ గట్టిగా తగిలింది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. “పెద్ది చిత్ర ప్రదర్శనకు నిర్మాతలు కచ్చితంగా పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఇస్తేనే మా థియేటర్లలో ఈ సినిమాను ఆడనిస్తాం” అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అత్యంత కీలకమైన సంచలన తీర్మానం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌కు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకటే మాటగా తమ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. నిర్మాతలు పర్సంటేజీ పద్ధతికి అంగీకరిస్తూ అధికారికంగా సంతకం చేసి ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తామని, లేనిపక్షంలో సినిమాను నిలిపివేస్తామని ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు.

వీరమల్లు స‌మ‌యంలో వెనక్కి తగ్గాం.. ఇక కుదరదు!

గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలోనే తాము ఈ పర్సంటేజీ డిమాండ్‌ను గట్టిగా లేవనెత్తామని, అయితే ఆ సమయంలో తమ డిమాండ్ చెబితే సినిమాకు ఇబ్బంది అవుతుందని సర్దిచెప్పడంతో పరిశ్రమ హితం కోరి వెనక్కి తగ్గామని ఎగ్జిబిటర్లు గుర్తుచేశారు. ఆ తర్వాత నుంచి తమ డిమాండ్‌ను నిరంతరం వినిపిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. “నిర్మాతలు కావాలనే ఈ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతూ ఇక్కడి దాకా వచ్చింది. అయినా పోనీ, ఈ సినిమాను వదిలేద్దాం అనుకుంటే.. రాబోయే తదుపరి పెద్ద సినిమాకే ఆ పద్ధతి చేద్దాం అంటూ కాలయాపన చేస్తున్నారు. లేదా ఇంకా మూడు వారాల సమయం కావాలని కోరుతున్నారు. ఇలా వాయిదాలు వేయడం ఇక ఎంతమాత్రం కరెక్ట్ కాదు” అని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇందుకే ఇకపై వచ్చే ప్రతి పెద్ద సినిమాను పర్సంటేజ్ పద్ధతికే ఆడతామని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

‘పెద్ది’ పంచాయితీ తెగేనా..?
ఫిల్మ్ నగర్ వర్గాల్లో ‘పెద్ది’ సినిమాను ఈ పర్సంటేజీ ఇష్యూ నుంచి పక్కన పెట్టేశారని ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అసలు నిజం ఇప్పుడే బయటపడిందని ఎగ్జిబిటర్ల తీర్మానంతో స్పష్టమైంది. ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజీ కావాల్సిందేనంటూ తెలంగాణ ఎగ్జిబీటర్లు భీష్మించుకోవడంతో ఇప్పుడు ఈ పంచాయితీ ఎటు దారితీస్తుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే థియేటర్ల యజమానులకు ఎంత శాతం పర్సంటేజీ ఇవ్వాలనే అంశంపై సదరు చిత్ర నిర్మాతలే త్వరగా తేల్చుకోవాల్సి ఉందని, ఈ వివాదం త్వరగా ముగియకపోతే సినిమా విడుదలకు ఆటంకాలు తప్పవని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గట్టిగా హెచ్చరించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.