epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాట నిలబెట్టుకున్నా.. 

మాట నిలబెట్టుకున్నా.. 
100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చా
కార్పొరేటర్లూ గల్లా ఎగరేసుకుని అభివృద్ధి పనులు చేపట్టండి
యూసీఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా
రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని అభివృద్ధి చేస్తా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాక‌తీయ‌, కరీంనగర్ : గ‌త మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపే యూసీఎఫ్ స్కీం ద్వారా రూ.840 కోట్ల భారీ నిధులు తీసుకొచ్చి నా మాట నిలబెట్టుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం రెండో అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిధుల విడుదల కోసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కట్టర్‌లకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాదనలు త్వరితగతిన పంపిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా అందులో కరీంనగర్ ఉండటం గర్వకారణమన్నారు. గతంలో నిధుల్లేక కార్పొరేటర్లు పడ్డ కష్టాలు తనకు తెలుసని, ఇప్పుడు పుష్కలంగా నిధులు వస్తున్నందున గల్లా ఎగరేసుకుని తమ తమ డివిజన్లలో పనులు ప్రారంభించాలని సూచించారు. శివారు ప్రాంతాల అభివృద్ధి, సిటీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. డంపింగ్ యార్డు కోసం రూ.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. తన ఏడేళ్ల ఎంపీ కాలంలో నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని వివరించారు. కేంద్ర పారామిలటరీ గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోళ్లలో రవాణా ఖర్చులతో సహా అన్ని పైసలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా యుద్ధప్రాతిపదికన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే తాము ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.