epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి
ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి రుణాలు, ఉచిత బోరుబావులు మంజూరు చేయాలి
రైతులు, బడుగుల సమస్యలపై కేంద్ర సర్కారు చొరవ చూపాలి
క్షేత్రస్థాయి పరిశీలన దరఖాస్తులతో దళిత, గిరిజన వినతులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు వినతి
సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూల స్పందన
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఒక సమగ్ర వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు సర్వీసు రోడ్లు నిర్మించడంతో పాటు, దళిత, గిరిజన నిరుద్యోగులకు ఉపాధి రుణాలు, పేద రైతులకు వ్యవసాయ బోరుబావులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పై సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల జిల్లా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరి కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నాగ్పూర్ – అమరావతి క్రాస్ నుంచి వైరా ఎగ్జిట్ వరకు ఉన్న మార్గంలో రైతుల భూముల మధ్యలోంచి రోడ్డు నిర్మాణం జరగడం వల్ల పొలాలు రెండు భాగాలుగా విడిపోయి, వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వెళ్లేందుకు, పండిన ధాన్యాన్ని ఇళ్లకు చేర్చేందుకు దారి లేకుండా పోయిందని వివరించారు. ఈ భూములన్నీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమాండ్ ఏరియా కింద ఉన్నాయని, రోడ్డు నిర్మాణంతో వాగులు, కాలువలు దాటి పశువులను మేతకు తీసుకెళ్లడం రైతులకు కత్తిమీద సాములా మారిందని పేర్కొంటూ హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించి ఆదుకోవాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి రుణాలు
నిరుపేద దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కేంద్ర బడ్జెట్ నుంచి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దినసరి కూలీలుగా ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన యువత స్వయం ఉపాధి పొందేలా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వర్తింపజేయాలని కోరారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాధారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బాలాజీ తండా గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులను మంత్రికి అందజేశారు.
పీఎం-కుసుమ్ ద్వారా ఉచిత బోరుబావులు
సింగరేణి మండలం మాధారం గ్రామానికి చెందిన పేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూములకు సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రిని కోరారు. సరైన నీటి వసతి లేక, సొంతంగా బోరుబావులు తవ్వించుకునే స్థోమత లేక ఎంతోమంది పేద రైతుల భూములు బీడువారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి పథకాలైన పీఎం-కుసుమ్, పీఎంకేఎస్‌వై ద్వారా ఈ గ్రామంలోని అర్హులైన రైతులకు ఉచితంగా బోరుబావులు, పంపుసెట్లు మంజూరు చేయాలని విన్నవించారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో రైతుల దరఖాస్తులను పరిశీలించానని, కేంద్రం ఆదుకుంటే ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అనూహ్యంగా మెరుగుపడతాయని నెల్లూరి కోటేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.