epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2010లో పట్టా.. రికార్డుల్లో మాయం..

2010లో పట్టా.. రికార్డుల్లో మాయం..
అదృశ్యమైన సత్తవ్వ కుటుంబం భూహక్కులు
ఐదు దశాబ్దాలుగా సాగులో.. రెండేళ్లుగా భూ రికార్డుల స‌మ‌స్య‌లు
ప‌రిష్కారం కాక  కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
‘భూమి మాదే అయితే హక్కులివ్వండి.. లేదంటే నోటీసివ్వండి’
అధికారుల ముందు స‌త్త‌వ్వ కుటుంబ స‌భ్యుల‌ వేడుకోలు
పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
కాక‌తీయ‌, చందుర్తి : ప్రభుత్వం ఇచ్చే పట్టా కాగితాలకే దిక్కులేకపోతే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కముటం సత్తవ్వ కుటుంబమే ఒక నిదర్శనం. 2010లో ప్రభుత్వం అధికారికంగా పట్టా ఇచ్చిన భూమి, కొత్త పాసుపుస్తకాల జారీ సమయంలో రికార్డుల నుంచి మాయమైపోయింది. ఐదు దశాబ్దాలుగా అదే భూమిని సాగు చేసుకుంటున్నా, నేడు సర్కారు లెక్కల్లో ఆ రైతు కుటుంబానికి కనీసం ఉనికి లేకుండా పోయింది.
పట్టా ఇచ్చిన ప్రభుత్వమే.. పేరు తొలగించిందా?
సత్తవ్వ భర్త నర్సయ్యకు మల్యాల శివారులోని సర్వే నంబర్ 32/అలో 2 ఎకరాల 10 గుంటల భూమికి 2010లో అప్పటి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అప్పటివరకు సాగులో ఉన్నా, అధికారికంగా పట్టా రావడంతో రైతు కుటుంబం ఎంతో సంబరపడింది. అయితే, ఆ తర్వాత వచ్చిన కొత్త పాసుపుస్తకాల ప్రక్రియలో సత్తవ్వ పేరు గాలిలో కలిసిపోయింది. ఆశ్చర్యకరంగా నేడు ధరణి రికార్డుల్లోనూ వీరి పేరు కనిపించడం లేదు. “గతంలో పట్టా ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు రికార్డుల నుంచి పేరును ఎందుకు తొలగించింది? మాకు సమాధానం చెప్పే నాథుడే లేడా?” అని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూనే..
సమస్య పరిష్కారం కోసం సత్తవ్వ కుటుంబం రెండున్నరేళ్లుగా తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చెప్పులు అరిగేలా తిరుగుతోంది. ప్రతిచోటా దరఖాస్తులు ఇస్తున్నా, విచారణ చేస్తామని చెబుతున్నారే తప్ప, సమస్యను పరిష్కరించేందుకు అధికారుల అడుగు ముందుకు పడటం లేదు. అధికారుల నిర్లక్ష్యమో, రికార్డుల మాయాజాలమో తెలియదు కానీ, ఒక పేద రైతు కుటుంబం మాత్రం న్యాయం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
పంట మనది.. అమ్మేది ఇతరుల పాసుపుస్తకాలతో!
ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన పంటను కూడా తమ పేరుతో విక్రయించుకోలేని దుస్థితి వీరిది. సొంత భూమిలో పంట పండిస్తున్నా, రైతుబంధు రాదు, బ్యాంకు రుణాలు దక్కవు, కనీసం రైతు బీమా కూడా అందదు. ధాన్యం విక్రయించాలంటే ఇతరుల పాసుపుస్తకాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. “సాగు చేస్తున్నది మేము.. కష్టపడుతున్నది మేము.. కానీ రికార్డుల్లో మాత్రం రైతు మరొకరు! ఇది ఎలాంటి పరిపాలనా అన్యాయం?” అని బాధిత రైతు కుటుంబం వేదన వ్యక్తం చేస్తోంది.
ఎక్కడ జరిగింది పొరపాటు?
2010లో పట్టా ఇచ్చిన భూమి రికార్డుల నుంచి ఎలా మాయమైంది? కొత్త పాసుపుస్తకాల సమయంలో జరిగిన తప్పును సరిదిద్దడానికి ఇన్ని ఏళ్లు ఎందుకు పడుతోంది? ధరణిలో పేర్లు నమోదు చేయకపోవడానికి బాధ్యులెవరు?  లింగంపేట గ్రామానికి చెందిన సత్తవ్వ కుటుంబానికి జరిగిన ఈ పరిపాలనా అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల‌ని గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు.  రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అసలు నిజానిజాలను వెలికితీయాలి. అర్హులైన ఆ కుటుంబానికి భూ హక్కులను కల్పించి, ఇప్పటివరకు కోల్పోయిన రైతుబంధు, ఇతర సాయాన్ని కూడా అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల ఓ రైతు కుటుంబం తన భూమిపైనే పరాయివాడిగా మిగిలిపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.