epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దుమ్ముగూడెంలో ‘మద్యం’ మాఫియా

దుమ్ముగూడెంలో ‘మద్యం’ మాఫియా
సిండికేట్ డాన్ కనుసన్నల్లోనే దందా
ఎమ్మార్పీకి మించిన ధరలు వసూలు
పర్ణశాల వంటి పుణ్యక్షేత్రాల్లోనూ బెల్ట్ షాపులు
ఎక్సైజ్ అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?
వివ‌ర‌ణ అడ‌గ‌గానే ఫోన్ క‌ట్ చేసిన ఎక్సైజ్ సీఐ

కాక‌తీయ‌, దుమ్ముగూడెం : ప్రభుత్వ నిబంధనలను, ఎక్సైజ్ శాఖ నియమాలను తుంగలో తొక్కి, మద్యం సిండికేట్ ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా మారింది. దుమ్ముగూడెం మండలంలో ఒక మద్యం మాఫియా డాన్ కనుసన్నల్లో మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా మూడు లైసెన్స్‌లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క షాపును మాత్రమే చూపిస్తూ, మిగిలిన నిల్వలను బెల్ట్ షాపులకు తరలించి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ములకపాడులో రెండు, ఆర్లగూడెంలో ఒకటి చొప్పున మూడు వైన్ షాపులకు అనుమతులు ఉన్నాయి. కానీ, నిబంధనల ప్రకారం నడపాల్సిన ఈ దుకాణాలు ఇప్పుడు కేవలం ‘స్టాక్ పాయింట్లు’గా మారాయి. బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలించడమే ప్రధాన వ్యాపారంగా సాగుతోంది. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాలన్న ప్రభుత్వ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. బెల్ట్ షాపుల్లో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తూ, సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. సీతానగరం, మారాయిగూడెం, సీతారాంపురం వంటి ప్రాంతాల్లో ఈ సిండికేట్ పట్టు బిగించింది.

గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
37 గ్రామ పంచాయతీలు, 83 గ్రామాల్లో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. బడి, గుడికి సమీపంలో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నా, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక మహిళలు, సర్పంచులు బెల్ట్ షాపులు వద్దని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే నాథుడే లేడు. దీనికి తోడు, ఈ మాఫియా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు మద్యాన్ని తరలిస్తూ అక్రమ ఆదాయాన్ని గడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఇదే దందా సాగిస్తున్న ఆ ‘డాన్’, సిట్టింగ్ సౌకర్యాలు లేకుండానే అధికారులను మేనేజ్ చేయడంలో దిట్ట అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మౌనం.. వత్తాసు పలుకుతున్న వైనం!
మద్యం మాఫియా పట్ల ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిస్సహాయతను ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. అధికారులకు నిత్యం సకల మర్యాదలు, విందులు అందుతుండటంతోనే, ఫిర్యాదులు చేసినా స్పందన ఉండటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు భద్రాచలం ఎక్సైజ్ సీఐని సంప్రదించగా, ‘కాకతీయ రిపోర్టర్’ అని తెలియగానే కాల్ కట్ చేసి సమాధానం దాటవేయడం, ఈ మాఫియాకు అధికారుల అండ ఎలా ఉందో స్పష్టం చేస్తోంది. గ్రామాలు, కుటుంబాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోని అధికారుల తీరుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ నిద్రలేచి, మద్యం సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.