epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్రగ్స్‌కు దూరంగా.. భవిష్యత్తుకు దగ్గరగా!

డ్రగ్స్‌కు దూరంగా.. భవిష్యత్తుకు దగ్గరగా!
కేజీబీవీ విద్యార్థినులకు చందుర్తి పోలీసుల ‘ఓపెన్ హౌస్’
పోలీసులతో ముఖాముఖి.. సందేహాల నివృత్తి

కాక‌తీయ‌,చందుర్తి : విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా “ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి స్థానిక ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, అలవాట్లు జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయన్నారు. డ్రగ్స్ బారిన పడితే చదువుతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, సామాజిక గౌరవం తీవ్రంగా దెబ్బతింటాయని విద్యార్థినులకు వివరించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను మూలాలతో సహా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెంచిందని ఎస్ఐ రమేష్ తెలిపారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు, డిజిటల్ మానిటరింగ్, సైబర్ నిఘా, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

పోలీసులతో ముఖాముఖి.. సందేహాల నివృత్తి
ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అక్కడి రికార్డుల నిర్వహణ, ఆయుధాలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలీసుల విధులు, బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులతో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి… మీ కలలకు అవును చెప్పండి” అనే బలమైన సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో మంచి స్పందనను రేకెత్తించింది. భవిష్యత్తులో కూడా యువతను తప్పుదోవ పట్టకుండా కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.