కొత్తగట్టు ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీ
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కొత్తగట్టు ఆరోగ్య ఉపకేంద్రాన్ని సోమవారం డాక్టర్ ఉమాశ్రీ (పీవోడీటీటీ), డాక్టర్ హిమబిందు (డీటీసీవో) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో ఫీవర్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో పల్లె దవాఖాన ఎంఎల్హెచ్పీ వడ్లకొండ అనిల్, ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు.

