epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రోసోళ్ల‌ను ప్రజలు ఉరికించి కొడతారు

  • కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చి నిజాలు చెబితే వీళ్ల‌కు విలువుండ‌దు
  • తెలంగాణ రైతాంగానికి నీళ్లందించేందుకు కాళేశ్వరం సిద్ధంగా ఉంది
  • ఇప్ప‌టికైనా పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి
  • ఎల్‌ఎండీతో పాటు 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
  • కరీంనగర్ దిగువ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్‌

కాకతీయ, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న వాస్తవాలను చెబితే, కాంగ్రెస్ నాయకులను ప్రజలే నిలదీస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోని దిగువ మానేరు (ఎల్‌ఎండీ) జలాశయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తిని కాళేశ్వరం అవినీతి కేసుతో అనుసంధానం చేస్తూ జైలుకు పంపిస్తామని బెదిరించడం దురదృష్టకరమన్నారు.

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయ విమర్శలతో కాలం గడపడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్‌స్టేషన్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఒక్క ప్రభుత్వం సంకల్పంతో పంపులు ఆన్ చేస్తే రైతులకు వెంటనే సాగునీరు అందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంపులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇస్తే, ఆయనపై రాజకీయ విమర్శలు కూడా చేయబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే బీఆర్ఎస్ కార్యకర్తలే వెళ్లి పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయన సంయమనం పాటించాలని సూచించారని వెల్లడించారు.

తీవ్ర తాగునీటి సంక్షేమ ప్రమాదం
ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 20 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు సుమారు 9 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా, ప్రభుత్వం వాటిని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా ఎల్‌ఎండీ జలాశయం నీటి కోసం ఎదురుచూస్తోందని, వెంటనే కాళేశ్వరం పంపులను నడపకపోతే కరీంనగర్‌తో పాటు ఎల్‌ఎండీపై ఆధారపడిన తొమ్మిది నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలు పక్కనపెట్టి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు, ప్రజలకు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.