జోన్ డ్యూటీ మీట్‌లో భద్రాద్రి పోలీసుల హవా
12 పతకాలతో రికార్డు సృష్టించిన భద్రాద్రి పోలీసులు
అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: జోన్ నాలుగు పోలీస్ డ్యూటీ మీట్-2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మూడు స్వర్ణ, ఏడు రజత, రెండు కాంస్య పతకాలతో మొత్తం పన్నెండు పతకాలను సాధించి జిల్లా కీర్తిని చాటారు. కొత్తగూడెం ఒకటో టౌన్ సీఐ ఎం.కరుణాకర్ రెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలను గెలుచుకుని సత్తా చాటారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. పతక విజేతలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

