epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అమ్మకానికి చెరువులోని చెట్లు

అమ్మకానికి చెరువులోని చెట్లు
వంద‌ల చెట్ల‌ను న‌రికేసేందుకు రూ.1.40 లక్షలకు భేరం!
అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులో వ‌న మేధానికి ప్ర‌య‌త్నాలు
నిబంధనలకు విరుద్ధంగా నరికివేతకు రంగం సిద్ధం
ఒక్కో చెట్టుకూ ధర కట్టిన అంకుషాపురం గ్రామానికి చెందిన కొంద‌రు
అధికారుల అనుమతులు లేకుండానే న‌రికివేత‌కు ప్లాన్‌

కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులోని చెట్ల విక్రయ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రజల ఆస్తిగా పరిగణించాల్సిన చెరువు పరిధిలోని విలువైన చెట్లను అక్రమంగా విక్రయించేందుకు కొందరు యత్నిస్తుండటం గ్రామస్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రూ.1.40 లక్షల వరకు భేరం కుదిరిందని, రేపోమాపో చెట్లను నరికివేసేందుకు అక్రమార్కులు సిద్ధమవుతున్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. చెరువు పరిధిలో ఉన్న చెట్లు ప్రజా ఆస్తి కిందకే వస్తాయి. వీటిని తొలగించాలన్నా లేదా విక్రయించాలన్నా అటవీ శాఖ, నీటి పారుదల శాఖ వంటి సంబంధిత విభాగాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఈ వ్యవహారంలో ఎటువంటి పారదర్శకత లేకుండా, అధికారుల ప్రమేయం లేదా అనుమతులు ఉన్నాయో లేదో తెలియకుండానే చెట్లను నరికేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు సాగిస్తున్న ఈ దందాపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణానికి ముప్పు.. ఆందోళనలో గ్రామస్థులు
చెట్లను నరికివేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లోని సహజ సౌందర్యం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చెరువు గట్టున ఉన్న చెట్లు భూసారాన్ని కాపాడటంతో పాటు, పక్షులకు ఆవాసంగా ఉంటున్నాయని, వాటిని తొలగించడం వల్ల ఊరికి తీరని నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు.

అధికారులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరగాలి!
ఈ వ్యవహారంపై సంబంధిత మండల అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ చెట్లను విక్రయించడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఆ రూ.1.40 లక్షల బేరం ఎవరి మధ్య కుదిరింది? వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నరికివేతను వెంటనే అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు మౌనం వహిస్తే ప్రజా ఆస్తి అన్యాక్రాంతం కావడం ఖాయమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.