epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్వోబీ జాప్యంపై బండి సంజయ్ ఆగ్రహం

  • ప్రజల ఇబ్బందులపై అధికారులను నిలదీత..ప్రత్యామ్నాయ పనులకు మేయర్‌కు ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ : తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యం, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ వృద్ధురాలు ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో పడిపోయిన ఘటనపై స్పందించిన ఆయన, అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పనుల్లో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్ స్పందిస్తూ ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం దానిపై దృష్టి సారించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయని వివరించారు.ఈ నేపథ్యంలో బండి సంజయ్ న్యూఢిల్లీ నుంచి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో ఫోన్‌లో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.మంత్రి ఆదేశాల మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హుటాహుటిన తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులను గమనించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు సేతు బంధన్ పథకం కింద ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తున్నప్పటికీ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని బండి సంజయ్ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కాంట్రాక్టర్, భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, గత ప్రభుత్వ కాలంలో జరిగిన జాప్యం వల్లే నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోందని, త్వరలో నోటిఫికేషన్ జారీ కానుందని చెప్పారు.రాబోయే ఆరు నెలల్లో ఆర్వోబీ ఒక వైపు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలోగా రెండు వైపులా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.