epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గోదావరి ఒడ్డున కలెక్టర్ అంకిత్‌ మకాం..!

  • రెండో ప్రమాద హెచ్చరికతో అప్రమత్తం
  • భద్రాచలంలో వరద పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన
  • పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశాలు
  • 24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంచాలని సూచన
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
  • గోదావరిలోకి ఎవరినీ అనుమతించొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశం
  • 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : “ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలి” అని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం వరద పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ వద్ద వరద నీటి పారుదల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, మోటార్ల పనితీరుపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా మోటార్లను నిరంతరం పనిచేసేలా చూడాలని, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

స్నానఘాట్ల వద్ద కట్టుదిట్టమైన నిఘా

అనంతరం కరకట్టపై నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్, స్నానఘాట్ల వద్ద పరిస్థితిని సమీక్షించారు. గోదావరిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను అనుమతించవద్దని, ప్రమాదకర ప్రాంతాల వద్ద నిరంతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోందని, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.

24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు

వరద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, 24 గంటల పాటు ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.