epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖాకీలకు నేర మరకలు

ఖాకీలకు నేర మరకలు
కరీంనగర్ పోలీసు శాఖలో వరుస ఘటనలు కలకలం
ప్రత్యర్థిపై గంజాయి కేసు బనాయించిన కానిస్టేబుల్ అరెస్టు
డ్రంక్ అండ్ డ్రైవ్ అక్రమాలపై ముగ్గురు సస్పెన్షన్
తప్పు చేసిన వారిపై వేటు వేస్తున్నా… మారరా ఖాకీలు?

కాకతీయ, కరీంనగర్ : ప్రజలకు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు శాఖలోనే వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు కరీంనగర్ పోలీసు కమిషనరేట్ ప్రతిష్ఠపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు భూ వివాదంలో ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు బనాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు కావడం… మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ముగ్గురు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడటం… ఒకే వారంలో జరిగిన ఈ రెండు పరిణామాలు పోలీసు శాఖలో క్రమశిక్షణపై తీవ్ర చర్చకు దారితీశాయి. తప్పు చేసిన వారిపై కమిషనరేట్ రాజీలేని చర్యలు తీసుకుంటున్నప్పటికీ… వరుసగా ఇలాంటి ఘటనలు బయటపడుతుండటంతో “ఖాకీల్లో అసలు ఏమి జరుగుతోంది?” అనే ప్రశ్న వినిపిస్తోంది.

ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు..!

సివిల్ భూ వివాదంలో తనకు పరిచయం ఉన్న వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించేందుకు ప్రత్యర్థిపై గంజాయి కేసు నమోదు చేయించేలా ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు కుట్ర పన్నినట్లు కొత్తపల్లి పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి షాపులో గంజాయి ఉంచించి కేసు నమోదయ్యేలా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. అనంతరం మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని తన ఇంట్లో దాచిపెట్టినట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసే అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేయడం శాఖలో సంచలనంగా మారింది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ అక్రమాలు

మరోవైపు ట్రాఫిక్ విభాగంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు కమిషనరేట్ వెంటనే స్పందించింది. ప్రత్యేక కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా ఆర్ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, సాయికృష్ణలను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల భద్రత కోసం నిర్వహించే తనిఖీల్లోనే నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఒకవైపు తప్పు చేసిన వారిని గుర్తించి శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటూ పోలీసు కమిషనరేట్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. మరోవైపు వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు శాఖలో అంతర్గత పర్యవేక్షణ, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చట్టం ముందు ఎవరూ అతీతులు కారనే సందేశాన్ని ఉన్నతాధికారులు ఇస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖలో మరింత కఠినమైన పర్యవేక్షణ, జవాబుదారీతనం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి కేసు కుట్ర… డ్రంక్ అండ్ డ్రైవ్ అక్రమాలు… రెండు ఘటనలు రెండు విభాగాల్లో జరిగినా, పోలీసు శాఖలో క్రమశిక్షణకు సవాల్ విసిరిన సంఘటనలుగానే నిలిచాయి. తప్పు చేసిన వారిపై చర్యలు కొనసాగుతున్నా… ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.