epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంట్రాక్టర్‌ ఏం తమాషాగా ఉందా!

కాంట్రాక్టర్‌ ఏం తమాషాగా ఉందా!
ఆగస్టు 15 గడువు దాటినా మారెళ్లపాడు పనులు పూర్తి కాలేదెందుకు?
అధికారులు పనిచేస్తున్నారా.. ఆడుకుంటున్నారా?
లిఫ్ట్‌ పనులకు అడ్డంకుల్లేకున్నా జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం
నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలంటూ అల్టిమేటం
రైతుల జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరిక

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఆగస్టు 15లోగా రైతులకు సాగునీరు అందించాల్సిన మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు గడువు దాటినా పూర్తికాకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ సమస్య లేదు.. నిధుల కొరత లేదు.. పనులకు ఎలాంటి అడ్డంకులూ లేవు.. అయినా పనులు ఎందుకు పూర్తికాలేదంటూ అధికారులను, గుత్తేదారులను నిలదీశారు. “కాంట్రాక్టర్‌ ఏం తమాషాగా ఉందా? గడువు దాటినా పనులు ఎందుకు పూర్తి కాలేదు?” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారా.. లేక పనులను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పనులను వేగవంతం చేసి సాగునీరు అందించాలని ఆదేశించారు. అశ్వాపురం మండలం మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్షించారు. గతంలోనే ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని గడువు విధించినా.. ఆ గడువు ముగిసే నాటికి పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులకు భూసేకరణ, నిధుల సమస్యలు లేనప్పుడు ఇక జాప్యానికి కారణమేంటని ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా కాంట్రాక్టర్‌ను అధికారులు ఎందుకు ఒత్తిడి చేయలేదని నిలదీశారు. రైతులకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టు పనుల్లో కాలయాపన చేస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూరుస్తున్నప్పటికీ పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆటలాడొద్దని.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందే

మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులకు ఎవరైనా కావాలని అడ్డుపడితే పోలీసుల సహకారంతోనైనా పనులు కొనసాగించాలని ఆదేశించారు. పనుల్లో రాజకీయ జోక్యం ఉంటే తగిన విధంగా స్పందిస్తామని మంత్రి హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఇకనైనా ఆలస్యం చేయకుండా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో పనుల పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తానని స్పష్టం చేశారు. నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్‌ సమన్వయంతో పనిచేయాలని మంత్రి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.