epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను కాపాడాలి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను కాపాడాలి
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా
పథకాలను నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలి
పెండింగ్‌ సాయం వెంటనే విడుదల చేయాలి
తులం బంగారం హామీ ఏమైంది
హైకోర్టు కేసులో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు
బీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని కోరారు. సోమవారం బీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర పార్టీ ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మాజీ సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌, ఆంధ్రాబ్యాంక్‌ సొసైటీ చైర్మన్‌ బి.రెడ్డి నాగచంద్రారెడ్డి, కర్ణాటి కృష్ణ తదితరులు మాట్లాడారు.

కేసీఆర్‌ హయాంలో పేదలకు అండ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఆర్థిక భారంగా మారుతున్న విషయాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం 2014 అక్టోబర్‌ 2న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రారంభించిందని నాయకులు గుర్తుచేశారు. ప్రారంభంలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని తెలిపారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అమలు చేసిన పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు విస్తరించారని పేర్కొన్నారు. సుమారు 13 లక్షల కుటుంబాలకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం అందించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా, ఇప్పటికే అమలులో ఉన్న పథకాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, కల్యాణలక్ష్మి సాయం ఎప్పుడు అందిస్తారని పేదింటి ఆడబిడ్డలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు.

పెళ్లయి పిల్లలు పుట్టినా సాయం లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అర్హులైన లబ్ధిదారులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని నాయకులు తెలిపారు. కొందరికి పెళ్లయి పిల్లలు పుట్టినా సాయం అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆమోదమైన దరఖాస్తులకు సంబంధించిన చెక్కుల పంపిణీలోనూ జాప్యం జరుగుతోందని విమర్శించారు. కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం పలుమార్లు గడువు లభించినా కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన పథకంపై ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేదని నిలదీశారు. ఇతర కీలక కేసుల్లో ప్రైవేటు న్యాయవాదుల సేవలు తీసుకునే ప్రభుత్వం, కల్యాణలక్ష్మి విషయంలో ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ప్రశ్నించారు. పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెండింగ్‌ సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, తులం బంగారం హామీ అమలుపై ప్రకటన చేయాలని కోరారు. పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన పథకాలను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోటా రామారావు, నాగండ్ల కోటి, మాటేటి నాగేశ్వరరావు, పల్లా రోస్‌లీనా, కూరాకుల వలరాజు, పసుమర్తి రాంమోహన్‌, బుర్రి వెంకట్‌, జ్యోతి రెడ్డి, మహ్మద్‌ తాజుద్దీన్‌, బుర్రి వినయ్‌, పాలడుగు పాపారావు, ఊటుకూరి రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.