బీఆర్ఎస్లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి
నల్లబెల్లి మండల క్లస్టర్ ఇన్చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి
కాకతీయ, నల్లబెల్లి:
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, నల్లబెల్లి మండల క్లస్టర్ ఇన్చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండలంతో పాటు నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతానన్నారు.
ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల తన పార్టీ మార్పుపై ప్రచారం జరిగిందని, అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజాసేవకు అంకితమవుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తల సమిష్టి ప్రోత్సాహంతో నల్లబెల్లి మండల ప్రజలకు మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

