దళితుల హక్కుల సాధనకు అండగా ఆర్‌పీఐ
ఆర్‌పీఐ భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్ పిలుపు
కాకతీయ, రుద్రంగి: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, సినీ నిర్మాత మార్గం గోపి మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేంద్ర గైక్వాడ్ మాట్లాడుతూ దళితుల హక్కుల సాధన, అభ్యున్నతికి ఆర్‌పీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తనను ఆదరించి సన్మానించిన రుద్రంగి మండల దళిత సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దయ్యాల నారాయణ, గసికంటి రాజు, కట్కూరి దాసు, తర్రె లింగం, సింగారపు గంగరాజం, దయ్యాల పెద్దులు, సుంచు అనిల్‌కుమార్, సింగారపు గంగిరెడ్డి, లింగంపెల్లి సుదర్శన్, గొళ్ళెం నర్సింగ్, కుమార్, స్థానిక యువకులు పాల్గొన్నారు.

