epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు
మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి!
సాగునీటి–విద్య–వైద్య రంగాల్లో వేగంగా అభివృద్ధి
భారీ పరిశ్రమలతోనే యువతకు ఉపాధి
ఖమ్మానికి ఇండస్ట్రియల్ పార్క్ అవసరం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సమిష్టిగా పనిచేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

జిల్లాలో ఉన్నత విద్యను విస్తరించేందుకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్టు, వైద్య రంగంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించినట్టు డిప్యూటీ సీఎం వివరించారు. సాగునీటి పారుదలలో భాగంగా మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి ఉపాధి కల్పించడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే ఖమ్మం జిల్లాకు ఒక భారీ ఇండస్ట్రియల్ పార్క్‌ను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలిపారు. అలాగే జిల్లాకు మరిన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు మంజూరు చేయాలని, అభివృద్ధిలో ఖమ్మాన్ని రాష్ట్రంలో ముందువరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.