epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కౌన్సిల‌ర్‌గా భార్య పోటీ.. భ‌ర్త స‌స్పెండ్‌..!

బీఆర్ఎస్ అభ్యర్థి భర్త సస్పెన్షన్‌తో రాజకీయ కలకలం
చేర్యాలలో ఎన్నికల వేళ హైడ్రామా
కానిస్టేబుల్ రమేష్‌పై వేటు వేస్తూ అర్ధ‌రాత్రి ఉత్త‌ర్వులు
కక్షపూరిత చర్య అంటూ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి నిర‌స‌న‌

కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి భర్తపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి భర్త, కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గీతాంజలి కుటుంబసభ్యులతో కలిసి చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు.
చేర్యాల మున్సిపాలిటీలో రెండో వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కమలాపురం గీతాంజలి, కాంగ్రెస్ అభ్యర్థిగా ముస్త్యాల తేజ పోటీలో ఉన్నారు. గీతాంజలి భర్త రమేష్ తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో పోలీస్ ఉన్నతాధికారులు శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.

కక్షపూరిత చర్య అంటూ ఆరోపణలు
ఈ ఘటనపై గీతాంజలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు బీ-ఫామ్ ఇచ్చారని తెలిపారు. తాను ప్రజల్లో చురుగ్గా ప్రచారం చేస్తుండటాన్ని చూసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి భయంతో కుట్రపూరితంగా తన భర్తపై చర్యలు తీసుకునేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి తేజ భర్త సంజీవయ్య ఇటీవలే ట్రాన్స్‌కోలో ఎస్ఈగా పదవీ విరమణ చేసి కాంగ్రెస్‌లో చేరారని, అధికార బలాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గీతాంజలి మండిపడ్డారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని డబ్బు ఆశ చూపించి ఒత్తిడి చేసినా తాము తలొగ్గలేదన్నారు. ఎన్నికల సమయంలో తన భర్తను సస్పెండ్ చేయించడం ద్వారా మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యేనని, ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, తన భర్త రమేష్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గీతాంజలి డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ చర్య జరిగిందా? లేక నిబంధనల ఉల్లంఘన వల్లేనా అన్న అంశంపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.