మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వహీద్
ఇటీవల అకాల మరణం చెందిగా అతని కుటుంబానికి ఆయన చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఆదివారం వహీద్ నివాసానికి వెళ్లిన స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహాయం అందజేశారు. వహీద్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 1994-95 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన ఆయన స్నేహితులు మానవత్వంతో స్పందించి, కుటుంబానికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్నేహితులందరూ కలిసి సేకరించిన రూ.22,000 నగదు సహాయంతో పాటు ఒక క్వింటాల్ బియ్యాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కష్టకాలంలో తామున్నామంటూ ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో వహీద్ స్నేహితులు చీకట్ల రాజమౌళి, చీకట్ల సతీష్, మేడుదుల వెంకన్న, మక్త సతీష్, ఎండి జహీర్, తుమ్మ సుధాకర్, కల్లూరి సబిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

