రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు జీనియస్ క్రీడాకారుల ఎంపిక
జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన అకాడమీ విద్యార్థులు
కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్–7, అండర్–11 చదరంగం పోటీలలో జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 22న పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణమండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు తమ సత్తా చాటారు. అండర్–7 బాలికల విభాగంలో ఎం. సాన్విత, కే. అద్వైత, ఎన్. సాన్విత.. బాలుర విభాగంలో శ్రీ హన్సిత్, కే. శ్రేయాన్స్, ఏ. శ్రేయన్స్ ఎంపికయ్యారు. అలాగే అండర్–11 బాలికల విభాగంలో ఎస్. నేహిత, జి. తన్వి, లక్ష్మీ నందిని.. బాలుర విభాగంలో ఎన్. అశ్విన్, జటిన్ సిద్ధార్థ, సహర్ష్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను గురువారం జ్యోతి నగర్‌లోని జీనియస్ చెస్ అకాడమీలో అభినందించారు. ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య మాట్లాడుతూ.. ఈనెల 26న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు మరింత రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్, కో-డైరెక్టర్ కంకటి సుజన్ కుమార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ డెమొక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు, కోచ్‌లు అభిరామ్, రేవిక్, స్వాతి, శ్రీనిజ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

